వర్షాలు పడ్డా అల్లాడుతున్నారు
సూర్యుడు తన ప్రతాపంతో నగర ప్రజలను ఉడికించి... ఉక్కపోయించి... చెమట పట్టించి వెళ్లాడు... ఇంతలో రుతుపవనాల రాకతో వర్షాలు మొదలైయ్యాయి. ఇంకేం హమ్మయ్య అంటూ సేద తీరవచ్చు అనుకుంటున్న నగర జీవికి మళ్లీ ముచ్చెమట్లు పడుతున్నాయి. వేసవి వెళ్లింది... వర్షాలు వచ్చాయి వాతావరణం చల్ల బడిందనుకుంటున్న తరుణంలో ముచ్చెమట్లు ఏమీటా అని సందేహమా ?... ఏమీ లేదండి నగరంలో కూరగాయలు... నాన్ వెజ్... పప్పులు... ఉప్పులు... నూనెలు ఇలా చెప్పుకుంటు పోతే ఒక్కటేమిటీ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. వాటి రేట్లు చూస్తే సగటు నగర జీవికి దిమ్మతిరిగి పోవాల్సిందే.
కూరగాయలు రేట్లు (కిలోల్లో).. చిక్కుడు రూ. 50, టమాట రూ. 30, వంకాయ రూ 30, క్యారెట్ 40, దొండకాయ రూ. 40 మిర్చి రూ. 40... వెజ్ రేట్లు ఇలా ఉంటే నాన్ వెజ్ చికెన్ కేజీ రూ. 250, మటన్ కేజీ రూ. 600, చివరికి చిల్లరగా ఓ కోడిగుడ్డు రూ. 4.50 అయింది. మినపప్పు రూ.150, కందిపప్పు రూ.130, ఇక నూనెల రేట్లు చెప్పనక్కర్లేదు సలసలా కాగుతున్నాయి. దీంతో ఈ రేట్లు చూసి నగర జీవి చల్లటి వాతావరణంలో కూడా ముచ్చెమట్లు పడుతున్నాయి. ఎండలు వెళ్లిన.. నిత్యవసర వస్తువుల రేట్లు చుక్కలను తాకడంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు.