సమంత ట్విట్టర్‌ లో ఫుల్‌ బిజీ.. ఎందుకు.. | Happy Birthday Dear Samantha | Sakshi
Sakshi News home page

సమంత ట్విట్టర్‌ లో ఫుల్‌ బిజీ.. ఎందుకు..

Published Fri, Apr 28 2017 8:59 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

సమంత ట్విట్టర్‌ లో ఫుల్‌ బిజీ.. ఎందుకు.. - Sakshi

సమంత ట్విట్టర్‌ లో ఫుల్‌ బిజీ.. ఎందుకు..

టాలీవుడ్‌  హీరోయిన్‌ సమంత బర్త్‌ డే ఈ రోజు.  ఈ ఏప్రిల్‌  28, శుక్రవారం  పుట్టిన రోజు  అందాల భామకు బర్త్‌డే విషెస్‌తో  ట్విట్టర్‌ లో మోతమోగుతోంది. దీంతో అమ్మడు  ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతోంది.  ఉదయం నుంచి ట్విట్టర్‌లో  ఒకటే సందడి చేస్తోంది.  తనకు శుభాకాంక్షలు తెలిపినవారందికి కృతజ్ఞతలు చెప్పే పనిలో ఫుల్‌ బిజీగా ఉంది. లవ్‌ యూ  ఆల్‌.. ఫర్‌ ఎవర్‌ అండ్‌ ఎవర్‌..థాంక్యూ వేరీ మచ్‌ అంటూ తన  సంతోషాన్ని షేర్‌ చేస్తోంది. ఫ్యాన్స్‌  సందడితో సమంత ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచింది.   టాలీవుడ్‌  క్రేజీ హీరోయిన్‌ రకుల్ , నటులు వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ ఇతర నటీనటులు, దర్శకులు సమంతాకు విషస్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు.  

కాగా  వరుస హిట్లతో టాప్ రేసులో దూసుకుపోతున్న సమంత  తెలుగు, తమిళ భాషల్లో కూడా   భారీ క్రేజ్‌  కొట్టేసింది.  ఏం మాయ  చేశావే చిత్రంతో కుర్రకారును మాయ చేసిన సామ్స్‌  రియల్‌ లైఫ్‌ లో యంగ్‌ హీరో నాగ చైతన్య  మనసులో కూడా పాగా  వేసిన  సంగతితెలిసిందే.  ఇటీవల ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న చైతు-సమంతల ఆ శుభఘడియ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆశుభవార్త ఎపుడు చెబుతుందో..  ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సినిమాతో నటిస్తున్న చెన్నై భామకు  మనం కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు  చెప్పేద్దాం.. సామ్స్‌..ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే టూ యు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement