ఓపెనింగ్ అదరగొట్టిన మార్కెట్లు
Published Fri, Feb 17 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో అదరగొట్టాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 8900 చేరువలో ఎంట్రీ ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మద్దతుతో మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 259 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 28,560 వద్ద, 66 పాయింట్ల లాభంలో నిఫ్టీ 8844 వద్ద ట్రేడవుతున్నాయి. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్లు కొనుగోలు చేసేటప్పుడు అమలు చేస్తున్న నిబంధనలను వెంటనే తొలగించనున్నట్టు ఆర్బీఐ వెల్లడించడంతో హెచ్డీఎఫ్సీ రికార్డ్స్ సృష్టించింది.
ఈ బ్యాంకు షేర్లు 8.41 శాతం ర్యాలీ నిర్వహించాయి. యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 1-2 శాతం పైకి ఎగిశాయి. గెయిల్, లుపిన్ లు కూడా లాభాలు పండిస్తున్నాయి. అయితే బీహెచ్ఈల్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్ లు నష్టాల్లో నడుస్తున్నాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి విలువ పడిపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 67.12గా ప్రారంభమైంది.
Advertisement
Advertisement