హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు ఆకర్షణీయం | HDFC Bank net profit up 25% on interest income, cost control | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు ఆకర్షణీయం

Published Sat, Jan 18 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

HDFC Bank net profit up 25% on interest income, cost control

ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో మంచి పనితీరును కనబరిచింది. నికర లాభం 25% ఎగసి రూ. 2,326 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి(అక్టోబర్-డిసెంబర్’12) రూ. 1,859 కోట్లను మాత్రమే ఆర్జించింది. బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 10,818 కోట్ల నుంచి రూ. 12,739 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16%పైగా జంప్‌చేసి రూ. 4,635 కోట్లకు చేరగా, గతంలో రూ. 3,982 కోట్లు నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 11% పుంజుకుని రూ. 2,483 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.3% నుంచి 4.2%కు స్వల్పంగా తగ్గాయి. నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.3%కు చేరగా, డిసెంబర్ చివరికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.7%గా నమోదైంది. ఇదే కాలంలో ఇటు డిపాజిట్లు, అటు రుణాలలో 23% వృద్ధిని సాధించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంకు షేరు ధర దాదాపు 1% క్షీణించి రూ. 668 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement