
అనిల్ గోస్వామిని పంపిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు మాతాంగ్ సింగ్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ ఉదయం కార్యాలయానికి రాగానే తనను కలవాలని గోస్వామికి రాజ్ నాథ్ కబురు పంపారు. దీంతో ఆయనను గోస్వామి కలిశారు. దాదాపు గంటసేపు వారు చర్చలు జరిపారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అనిల్ గోస్వామి ఇష్టపడలేదు.
అయితే ఆయనపై వేటు పడే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన విషయంలో కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందనేది త్వరలోనే తేలనుంది.