పెనుభూకంపం ధాటికి నేపాల్ కకావికలం అయిపోయింది.
పెనుభూకంపం ధాటికి నేపాల్ కకావికలం అయిపోయింది. మొదలైన కొద్దిసేపటికే తీవ్ర ప్రభావం చూపించిన భూకంపం ఎలా వచ్చిందన్న విషయం నేపాల్ లోని ఓ హోటల్ సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది.
ఈ వీడియో ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో స్విమ్మింగ్ పూల్ బీభత్సం మొత్తం రికార్డయింది. దాంతోపాటు ఒక్కసారిగా భవనం మొత్తం ఊగిపోతున్నట్లు కనపడింది.