'మోదీ ఓటమి చూడాలనుకుంటున్నా' | I want Modi to suffer a defeat: Ram Jethmalani | Sakshi
Sakshi News home page

'మోదీ ఓటమి చూడాలనుకుంటున్నా'

Published Mon, Oct 5 2015 11:46 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'మోదీ ఓటమి చూడాలనుకుంటున్నా' - Sakshi

'మోదీ ఓటమి చూడాలనుకుంటున్నా'

పాట్నా: ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారని ఒకప్పటి బీజేపీ నేత, వాజపేయి ప్రభుత్వ హయాంలో న్యాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రామ్ జెఠ్మలానీ ఆరోపించారు. మోదీని తప్పకుండా ప్రజలు శిక్షించాలని సూచించారు.

'ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఓటమిపాలు కావాలి. తప్పక శిక్షించాల్సిన వ్యక్తి మోదీ. నాకు బీహార్లో ఓటు ఉంటే కచ్చితంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కే వేస్తాను ఎందుకంటే మోదీ ఓటమిపాలుకావాని కోరుకుంటున్నాను. బీజేపీ ఓటమికి బీహారే ప్రారంభస్థానం కావాలి. బీజేపీ నేతలు నన్ను ఫూల్ చేయోచ్చేమో కానీ బీహార్ ప్రజలను అలా చేయలేరు' అని ఆయన అన్నారు. బీజేపీ సభ్యుడైన జెఠ్మలానీ సొంతపార్టీపైనే విమర్శలు చేస్తుంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement