పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్య విషయాల్లో భారతదేశం దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆ విభాగంలో భారత్ 155వ స్థానం దక్కించుకోవడం దానిని ప్రస్ఫుటం చేస్తుంది.
ఈపీఐ జాబితాలో భారత్‌కు 155వ స్థానం
దావోస్: పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్య విషయాల్లో భారతదేశం దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆ విభాగంలో భారత్ 155వ స్థానం దక్కించుకోవడం దానిని ప్రస్ఫుటం చేస్తుంది. 2014 పర్యావరణ ప్రదర్శన సూచీ (ఈపీఐ) శనివారం విడుదల చేసిన ర్యాంకుల్లో పాకిస్థాన్ (139), నేపాల్ (148) కన్నా భారత్ వెనుకబడింది. ఇక బ్రిక్స్‌లోని మిగతా దేశాలైన బ్రెజిల్ (77), రష్యా (73), చైనా (118) స్థానాల్లో నిలిచాయి.