‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు | Indian American Dr. Vadrevu Raju listed in Toledo University’s Hall of Fame | Sakshi
Sakshi News home page

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు

Published Fri, Apr 14 2017 10:39 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు

వాషింగ్టన్‌: అమెరికా ఒహయో రాష్ట్రంలోని టోలెడో మెడికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో తెలుగు వైద్యుడు వాడరేవు రాజుకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఆ తరువాత భారత్‌లోనే ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లండ్‌లోని సర్రేలోని ఓ ఆసుపత్రిలో అత్యవసర విభాగం అధికారిగా పనిచేశారు.

1984 నుంచి క్లినికల్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఐ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా (ఈఎఫ్‌ఏ)కు రాజు వ్యవస్థాపకుడు, మెడికల్‌ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే 14 దేశాల్లో తన సేవలను ప్రారంభించడంతో పాటు భారత్‌లో కంటి ఆసుపత్రులను స్థాపించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement