యూఎస్లో మూడో స్థానంలో భారతీయ అమెరికన్లు
యూఎస్లో నివసిస్తున్న ఆసియా అమెరికన్ వాసుల్లో భారతీయ అమెరికన్లు మూడో స్థానంలో నిలిచారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ వెల్లడించింది. చైనా అమెరికన్లు, ఫిలిప్పీన్స్ అమెరికన్లు మొదటి రెండు స్థానాలలో నిలిచారని తెలిపింది. యూఎస్లో నివసిస్తున్న ఆసియా అమెరికన్ వాసులకు సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికను సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది.
4.1 మిలియన్ల మందితో యూఎస్లో నివసిస్తూ అతి పెద్ద ఆసియా అమెరికన్ వాసులుగా చైనీయులు అవతరించారని, ఆ తర్వాత స్థానాన్ని 3.59 మిలియన్లతో ఫిలిప్పీన్స్ నిలిచారని వివరించింది. 3.34 మిలియన్ల మంది భారతీయులతో మూడో స్థానాన్ని ఆక్రమించారని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలను వరుసగా వియాత్నాం, కొరియా, జపాన్ వాసులు ఉన్నారని పేర్కొంది. యూఎస్లో 56 శాతం ఆసియా అమెరికన్ కమ్యూనిటీ కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, హవాయి రాష్ట్రాలలో నివసిస్తున్నారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ తన నివేదికలో తెలిపింది.