
రెండు ఫేస్ బుక్ పేజీలపై వేటు
న్యూఢిల్లీ: రెండు ఫేస్ బుక్ పేజీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నందుకు ఈ రెండు పేస్ బుక్ పేజీలను తొలగించింది. జమ్మూకశ్మీర్ లోని గుర్తు తెలియని వ్యక్తులు ఈ పేజీలను నిర్వహిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.
వీటి ద్వారా యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తుండడంతో ఈ రెండు ఫేస్ బుక్ పేజీలను తొలగించినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. బాంబులు తయారు చేయడం, స్వీయదాడులు, జిహాద్ శిక్షణ విధానాల వివరాలు ఇందులో ఉన్నాయి.
కాగా, ఇంటర్నెట్ ద్వారా ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును ఎలా ఎదుర్కొవాలనే దానిపై నిఘా, హోం, ఐటీ, సెర్ట్-ఇన్ సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం బుధవారం ఢిల్లీలో చర్చలు జరిపింది.