మళ్లీ పరిశ్రమల వెనుకంజ.. | Industries are their retreat again . | Sakshi
Sakshi News home page

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

Published Sat, Oct 12 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

 న్యూఢిల్లీ: జూలైలో కాస్త పర్వాలేదనిపించిన పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మళ్లీ మందగమనంలోకి జారిపోయింది. వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. జూలైలో వృద్ధి రేటు 2.8 శాతంకాగా, గత ఏడాది ఆగస్టులో ఈ రేటు 2 శాతంగా ఉంది. మే (మైనస్ 2.5 శాతం) జూన్ (మైనస్ 1.8 శాతం)లలో క్షీణతలో నడిచిన వృద్ధి సూచీ జూలైలో కాస్త మెరుగుపడ్డంతో ఆర్థిక విధాన నిర్ణేతలు, విశ్లేషకులు కొంత ఊరట పొందారు. అయితే తాజా ఫలితంతో ఈ ఊరట నీరుగారిపోయింది. తయారీ, వినియోగ వస్తువుల విభాగం సహా పలు రంగాల పేలవ పనితీరు తాజా నిరుత్సాహ ఫలితానికి కారణం. 2012 ఆగస్టుతో పోల్చి, 2013 ఆగస్టులో వివిధ పరిశ్రమల పనితీరును పరిశీలిస్తే...
 
     తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా మైనస్‌లోకి జారిపోయింది. 2.4% వృద్ధి నుంచి మైనస్ 0.1%కి క్షీణించింది.
 
     మైనింగ్: సూచీలో 14% వెయిటేజ్ ఉన్న ఈ రంగం క్షీణతలోనే కొనసాగుతోంది. అయితే క్షీణత -0.3 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది.
 
     విద్యుత్: ఈ రంగం మాత్రం మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఉత్పత్తి వృద్ధి రేటు 1.9 శాతం నుంచి 7.2 శాతానికి ఎగసింది.
 
     కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో ఉత్పత్తి -7.6 శాతం క్షీణించింది.
 
     క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచికైన క్యాపిటల్ గూడ్స్ రంగం -2 శాతం క్షీణించింది. 2012 ఆగస్టులో ఈ క్షీణత 4.4 శాతం.
 
 ఐదు నెలల్లో...: ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) వృద్ధి రేటు 0.2ు% నుంచి 0.1%కి పడిపోయింది. తయారీ రంగం  .. 2012 ఆగస్టులో వృద్ధి లేకుండా నిశ్చలంగా ఉండగా.. ఈ ఆగస్టులో   మైనస్ 0.1 శాతంలోకి జారిపోయింది. విద్యుత్ రంగంలో సైతం వృద్ధి 4.8 శాతం నుంచి 4.5 శాతానికి జారింది. అయితే  క్యాపిటల్ గూడ్స్ రంగం విషయానికి వస్తే- 2013 ఆగస్టులో ఈ రంగం కాస్త మెరుగుపడింది. ఈ రంగంలో 14.4 క్షీణత నుంచి 0.8 శాతం వృద్ధిలోకి మళ్లింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement