పాకిస్థాన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ | Inspired by Aam Admi Party, party with same name launched in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ

Published Sun, Mar 9 2014 9:11 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

Inspired by Aam Admi Party, party with same name launched in Pakistan

భారత దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనల్ని స్పూర్తిగా తీసుకుని పాకిస్థాన్ లో అదే పేరుతో ఓ పార్టీని ప్రారంభించారు. గుజ్రన్ వాలాలోని అర్సలాన్ ఉల్ ముల్క్ గ్రూప్ కు చెందిన మితవాదులు ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పేరుతో పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని నమోదు చేశారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ ఆలీ జిన్నా కలల్ని నిజం చేస్తామని ఆప్ చైర్మన్ తెలిపారు. 
 
ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రివాల్ నిర్వహించిన ఉద్యమ పంథాను స్పూర్తిగా తీసుకుని వచ్చేవారం పంజాబ్ అసెంబ్లీ ఎదుట నిరవధిక దీక్షను చేపట్టనున్నారు. పోలీసు సంస్కరణ, వేధింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించాలనే డిమాండ్ తో నిరవధిక దీక్షతో ఆందోళన ఆరంభించనున్నారు. ఏ ఉద్దేశంతో పాకిస్థాన్ ఏర్పడిందో.. ఆ ఆశయం నెరవేరలేదని, ప్రస్తుత రాజకీయ నాయకత్వం, అధికార వ్యవస్థ నమ్మకం కోల్పోయిందని.. జిన్నా కలలు కన్న పాకిస్థాన్ ఇదేనా అంటూ పాకిస్థాన్ కు చెందిన ఆప్ నేతలు మండిపడ్డారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement