ఫార్చ్యూన్ టాప్ ర్యాంక్ మళ్లీ ఐఓసీదే
ఫార్చ్యూన్ టాప్ ర్యాంక్ మళ్లీ ఐఓసీదే
Published Wed, Dec 11 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ ఇండియా-500 కంపెనీల ఈ ఏడాది జాబితాలో మళ్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ-ఆదాయం రూ.4,75,867 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆదాయం రూ. 4,09,883 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ ఆదాయాల పరంగా అగ్రశ్రేణి 500 భారతీయ కంపెనీలతో జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది టాప్ టెన్‌లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిల్లో నాలుగు చమురు కంపెనీలు కావడం విశేషం.
టాటా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు టాప్‌టెన్‌లో నిలిచాయి. అమ్మకాల వృద్ధి మందగించినప్పటికీ, లాభాల్లో రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని ఈ ఏడాది జాబితా సూచిస్తోందని ఈ మ్యాగజైన్ పేర్కొంది. భారత కంపెనీలు పరిపక్వత చెందుతున్నాయని వివరించింది. ప్రతిభ గల ఉద్యోగుల కోసం భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి వెనకాడ్డం లేదని పేర్కొంది. అందుకే ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఉద్యోగుల వేతనాలు, జీతాలు పెరిగాయని వివరించింది. టాప్ 8 కంపెనీలు గతేడాది తాము పొందిన స్థానాలనే ఈ ఏడాది కూడా నిలుపుకున్నాయి. ఇక ఈ జాబితాలో స్థానం సాధించిన ఇతర కంపెనీలు. భారతీ ఎయిర్‌టెల్(12వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంక్(14), ఎన్‌టీపీసీ(15), టీసీఎస్ (18), ఇన్ఫోసిస్(27వ స్థానం).
టాప్ టెన్ కంపెనీలు
ర్యాంక్ కంపెనీ
1 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
2 రిలయన్స్ ఇండస్ట్రీస్
3 భారత్ పెట్రోలియం
4 హిందూస్తాన్ పెట్రోలియం
5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6 టాటా మోటార్స్
7 ఓఎన్‌జీసీ
8 టాటా స్టీల్
9 ఎస్సార్ ఆయిల్
10 కోల్ ఇండియా
Advertisement
Advertisement