లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బెదిరిస్తున్నారంటూ ఆ రాష్ట్రానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములాయం తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ అమితాబ్ ఆరోపించారు.
తాను చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే 2006లో మాదిరిగా దాడి పునరావృతం అవుతుందని ములాయం హెచ్చరించినట్టు అమితాబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2006లో ఎస్పీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అమితాబ్పై దాడి చేశారు. ఓ ల్యాండ్ ఫోన్ నుంచి ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ములాయం మాట్లాడనున్నట్టు చెప్పారని, ఆ తర్వాత ములాయం తనతో 2 నిమిషాలకు పైగా మాట్లాడినట్టు అమితాబ్ చెప్పారు. ఇదిలావుండగా, అమితాబ్, ఆయన భార్య సామాజిక ఉద్యమకర్త నూతన్ థాకూర్.. ఉత్తరప్రదేశ్ గనుల శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, తదితరులపై గురువారం ఫిర్యాదు చేశారు. తమను తప్పుడు కేసుల్లో ఇరికేందకు ప్రయత్నిస్తున్నారని ఐజీ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ సీఎం బెదిరిస్తున్నారంటూ ఐజీ ఫిర్యాదు
Published Sat, Jul 11 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement