Samajwadi Party chief
-
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ‘‘ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?’’ అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. ఏమిటీ కేసులు? హమీర్పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్పూర్ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది. -
అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్! దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
లక్నో: మహ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి కార్చిచ్చులా రగిలిపోతుందే తప్ప ఇప్పట్లో ఎక్కడా చల్లబడేటట్లు లేదు. అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సహారన్పూర్లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన వెంటనే నిరసనకారులు పోలీస్‌స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక గుంపు కొన్ని మోటార్‌సైకిళ్లను, బండ్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించక తప్పలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే నిమ్మితం తొమ్మిది మంది పై గట్టిగా లాఠీ ఝళిపించారు. ఐతే ఈ ఘటన తాలుకా వీడియోని బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో ఇది "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరు పై, బీజేపీ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.."ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇలాంటి పోలీస్స్టేషన్లను గట్టిగా నిలదీయాలి. కస్టడీ మరణాల్లో యూపీనే నెంబర్ వన్. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘన, దళితులపై వేధింపుల్లో కూడా యూపీనే అగ్రగామిగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ పోలీసు ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి సుమారు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. (చదవండి: బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?) -
చేతిలోన చెయ్యేసి...
-
చేతిలోన చెయ్యేసి...
సాక్షి, లక్నో : వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేస్తారు. విమర్శలు-ప్రతివిమర్శల్లో ఎక్కడా తగ్గరు. వాళ్లిద్దరి వాయిస్‌ను.. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాక దేశమంతా గమనిస్తుంది. అటువంటి ఆ ఇద్దరు.. గురువారం సరదాగా సంభాషిస్తూ, హస్యోక్తులు విసురుకుంటూ.. ప్రాణ స్నేహితుల మాదిరిగా చేతిలోని చెయ్యేసి నడుచుకుంటే శాసనసభకు వచ్చారు. ఈ ఆశ్చర్యకర ఘటనకు యూపీ అసెంబ్లీ వేదికైంది. ఇద్దరూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మరొకరు సమాజ్ వాదీ పార్టీనేత ఆజంఖాన్. ఉత్తర ప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న సీఎం యోగి ఆదిత్యానాథ్, ఎస్పీ నేత ఆజంఖాన్.. ఇద్దరూ ఒకే సమయంలో అసెంబ్లీలో కారిడార్లోకి అడుగు పెట్టారు. ఒకరికొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు. తరువాత వివిధ అంశాలపై నడుస్తూ చర్చించారు. ఇంతలో ఆప్యాంగా ఆజంఖాన్ చేతిని యోగి ఆదిత్యనాథ్ తన చేతిలోకి తీసుకున్నారు. ఆజంఖాన్ కూడా అంతే ఆప్యాయంగా యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. గతంలో నమాజ్, సూర్య సమస్కారాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. దీనిపై ఆజం ఖాన్ స్పందిస్తూ.. అలా అయితే.. సూర్య సమస్కారాలకు బదులు నమాజ్ చేయవచ్చంటూ కూడా వ్యాఖ్యానించారు. -
నేనే సమాజ్‌వాదీ చీఫ్
-
నేనే సమాజ్‌వాదీ చీఫ్
అఖిలేశ్ కేవలం సీఎం.. శివపాల్ రాష్ట్ర అధ్యక్షుడు ♦ తేల్చి చెప్పిన ములాయం సింగ్ యాదవ్ ♦ ఈ నెల 17 లోపే తేలకపోతే ‘గుర్తు’ స్తంభించే అవకాశాలు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పార్టీకి తానే జాతీయ అధ్యక్షుడినని ములాయం సింగ్ యాదవ్ ఆదివారం స్పష్టంచేశారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా ములాయం పేర్కొన్నారు. అఖిలేశ్ మద్దతుదారుడైన రాంగోపాల్ యాదవ్‌పై ములాయం మండిపడ్డారు. ‘డిసెంబర్ 30నే రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాం. జనవరి 1న ఏ హోదాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆయన (రాంగోపాల్) నిర్వహిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నేతలు అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలోని వైరివర్గాలకు ఎన్నికల గుర్తు ‘సైకిల్’పై తమ వాదనలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువుకు ఒకరోజు ముందు ములాయం ఈ మేరకు తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడంపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా విలేకరుల ప్రశ్నలకు పూర్తిగా, ఓపికగా సమాధానాలిచ్చే ములా యం.. ఆదివారం సమావేశంలోమాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. మీడియా ప్రతినిధులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అఖిలేశ్‌కు మద్దతుగా ఎందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా చెల్లవన్నారు. కాగా, అమర్ సింగ్‌కు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. రాజీ మాటే లేదు: రాంగోపాల్ అయితే ఇరు వర్గాల మధ్య రాజీ జరుగుతోందంటూ వచ్చిన వార్తలను రాంగోపాల్ యాదవ్ ఖండించారు. కొందరు నేతాజీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ములాయంను పార్టీ మార్గదర్శకుడిగా, అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా పార్టీ జాతీయ కార్యవర్గం ఎన్నుకుందని గుర్తుచేశారు. కాగా, ఢిల్లీ బయలుదేరేముం దు లక్నోలో పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. ‘అఖిలేశ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతుంది. అయితేనేం. అఖిలేశ్ నా కుమారుడేగా’ అని వ్యాఖ్యానించినట్లు తెలి సింది. కాగా, ఈనెల 17లోగా పార్టీ గుర్తు సైకిల్‌పై ఈసీ నిర్ణయానికి రాలేని పక్షంలో ఆ గుర్తును స్తంభింపజేసే అవకాశాలున్నాయి. -
మాజీ సీఎం బెదిరిస్తున్నారంటూ ఐజీ ఫిర్యాదు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బెదిరిస్తున్నారంటూ ఆ రాష్ట్రానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములాయం తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ అమితాబ్ ఆరోపించారు. తాను చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే 2006లో మాదిరిగా దాడి పునరావృతం అవుతుందని ములాయం హెచ్చరించినట్టు అమితాబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2006లో ఎస్పీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అమితాబ్‌పై దాడి చేశారు. ఓ ల్యాండ్ ఫోన్ నుంచి ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ములాయం మాట్లాడనున్నట్టు చెప్పారని, ఆ తర్వాత ములాయం తనతో 2 నిమిషాలకు పైగా మాట్లాడినట్టు అమితాబ్ చెప్పారు. ఇదిలావుండగా, అమితాబ్, ఆయన భార్య సామాజిక ఉద్యమకర్త నూతన్ థాకూర్.. ఉత్తరప్రదేశ్ గనుల శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, తదితరులపై గురువారం ఫిర్యాదు చేశారు. తమను తప్పుడు కేసుల్లో ఇరికేందకు ప్రయత్నిస్తున్నారని ఐజీ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అస్వస్థతకు గురైన ములాయం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చినట్టు వైద్య వర్గాలు చెప్పాయి. వైద్య పరీక్షల అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ములాయంకు సూచించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా సాధారణ పరీక్షల కోసమే ములాయం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెప్పాయి. -
యూపీలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి
వాటిని మీడియా సంచలనం చేయొద్దు: ములాయం జనాభాపరంగా చూస్తే యూపీలోనే తక్కువ కేసులు అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎస్పీ చీఫ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ శనివారం మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో రేప్‌లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని, అలాంటి వాటికి మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సంచలనాత్మకం చేయకూడదని చెప్పారు. అసలు జనాభా పరంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, 21 కోట్ల మంది ఉన్నా తమ రాష్ట్రంలోనే రేప్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. అలాంటి కేసులపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందంటూ తన కుమారుడి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దుండగులు ఘోరంగా నరికి చంపిన ఒక యువతి మృతదేహం లక్నో పట్టణ సరిహద్దుల్లో గురువారం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసుంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ములాయం పైవిధంగా స్పందించారు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఒకసారి.. ‘‘మీపని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం’’ అని మీడియాను ఉద్దేశించి అన్నారు. మరోసారి యువకులు ‘‘తప్పులు చేస్తారు, అలాగని వారికి ఉరిశిక్ష వేస్తామా?’’ అని ప్రశ్నించారు. మండిపడ్డ ప్రతిపక్షాలు..ములాయం తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ.. ములాయం లాంటి ప్రముఖ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదని, మహిళలు, బాలలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అఖిలేశ్ సర్కార్‌కు సూచించారు. మరో బీజేపీ నేత విజయ్ పాఠక్ మాట్లాడుతూ.. జాతీయ గణాంకాలు చూస్తే యూపీలోనే రేప్, వరకట్న మృతి కేసులు ఎక్కువన్నారు. ములాయం వ్యాఖ్యలు బాధ్యతారహితమని బీఎస్పీ విమర్శించింది. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇలాంటి కేసు ఒక్కటి నమోదైనా అది ఆ రాష్ట్రానికి అవమానమేనన్నారు. మహిళల జాతీయ కమిషన్ సభ్యురాలు రషీద్ షమీమ్ మాట్లాడుతూ.. పేపర్లు చూస్తే ఆ రాష్ట్రంలో రోజుకు ఎన్ని రేప్‌లు జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు. -
ములాయం ముసలోడన్న అభ్యర్థి బహిష్కరణ
పార్టీ అధ్యక్షుడిని ఎవరైనా 'ముసలోడు' అంటే ఊరుకుంటారా? అందులోనూ సమాజ్‌వాదీ పార్టీ లాంటి చోట్ల అసలు కుదరదు కదా. అయినా ఆ విషయం గుర్తులేని ఓ అభ్యర్థి.. సరిగ్గా ఇదే వ్యాఖ్య చేశారు. ఆగ్రా లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని అయిన సారికా బఘెల్, ఆమె భర్త దేవేంద్ర సింగ్ స్వయంగా ములాయం సింగ్ యాదవ్ మీదే ఆయన ముసలోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో వారిద్దరినీ వెంటనే పార్టీనుంచి బహిష్కరించి అవతల పారేశారు. వెంటనే ఆగ్రా స్థానానికి కొత్త అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. మహారాజ్ సింగ్ ఢంగర్ ఈ స్థానంలో పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తెలిపారు. దేవేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం ఓ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఓ అధికారితో గొడవపడ్డారు. మహాత్మా గాంధీ రోడ్డులో ఆటోరిక్షాలను తిరగనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సరిగ్గా అప్పుడే ములాయం సింగ్ యాదవ్‌ను 'ముసలోడు' అన్నారు. ఆ విషయం వెంటనే పార్టీ వర్గాలకు చేరిపోయింది. అంతే, భార్యాభర్తలిద్దరినీ పార్టీనుంచి బహిష్కరించేశారు. -
అఖిలేష్‌కు క్లీన్ చీట్ ఎలా ఇస్తారు:బీజేపీ
సమాజవాది పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల భారతీయ జనతపార్టీ బుధవారం లక్నోలో మండిపడింది.ముజఫర్‌నగర్ అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించిన నేపథ్యంలో అఖిలేష్‌కు ఎలా క్లీన్ చీట్ ఇస్తారని యూపీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదుర్ పాథక్ ప్రశ్నించారు. ముజఫర్‌నగర్ అల్లర్లు మత ఘర్షణలుగా ములాయం వ్యాఖ్యానించడం పట్ల విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో నెలకొన్న సంఘటనలు అఖిలేష్ ప్రభుత్వ హయాంలో పునారావృతం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకరమైన సంఘటనగా ముజఫర్‌నగర్ అల్లర్లు అని ఆయన అభివర్ణించారు. అయితే ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం యూపీలోని అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా యూపీ గవర్నర్‌ను కలసి అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రాన్ని ఆ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఆందజేసింది. సెప్టెంబర్ 16 నుంచి యూపీ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముజఫర్‌నగర్ అంశాన్ని సభలో లేవనెత్తుతామని బీజేపీ ప్రకటించింది. ముజఫర్‌నగర్‌లో శనివారం చోటు చేసుకున్న అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించగా, మరో 1000 మంది వరకు గాయపడ్డారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ మంగళవారం ఆగ్రాలో తన కుమారుడు అఖిలేష్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బీజేపీ బుధవారంపై విధంగా స్పందించింది. అయితే ముజఫర్‌నగర్‌లో ఏ రాజకీయనాయకుడు పర్యటించకుండా ఉండేలా అఖిలేష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.