ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పార్టీకి తానే జాతీయ అధ్యక్షుడినని ములాయం సింగ్ యాదవ్ ఆదివారం స్పష్టంచేశారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా ములాయం పేర్కొన్నారు.