Shivpal
-
లాలూ కోసం బెదిరింపులు.. యోగి సీరియస్
లక్నో : దాణా స్కామ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. యూపీకి చెందిన ఇద్దరూ జడ్జిలే వీటి వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావటంతో యోగి విచారణ కమిటీని నియమించారు. జలౌన్ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్ డివిజినల్ న్యాయమూర్తి ఇద్దరూ తీర్పు వెలువడక ముందు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ ను ఫోన్లో సంప్రదించారంట. లాలూ శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్‌ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో వార్త ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. దీంతో యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని ఝాన్సీ కమిషనర్ అమిత్ గుప్తా వెల్లడించారు. మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్ సింగ్ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్‌లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్‌తో తాము చర్చించినట్లు సబ్ డివిజినల్ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్ అక్తర్ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. I never talked to him (Shivpal Singh) over phone. He must issue a statement, if it happened. On the date mentioned in reports, I was in my home town, on a leave.: Mannan Akhtar, Jalaun DM on reports of him calling Special Court Judge Shivpal Singh for Lalu Yadav on #FodderScam pic.twitter.com/X920OtaQJO — ANI UP (@ANINewsUP) January 11, 2018 -
‘ములాయం కోపం నా మీదే, ఆయన మీద కాదు’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి తన బాబాయి రాంగోపాల్ యాదవ్‌పై మీద ప్రశంసల జల్లు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఎన్నికల చిహ్నాన్ని కూడా ఆయనే కాపాడారని అన్నారు. కాగా నిన్న (గురువారం) రాంగోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందన్నారు. అయితే ఈ వేడుకకు ములాయం సింగ్ యాదవ్‌తో పాటు మరో సోదరుడు శివపాల్ యాదవ్ కూడా దూరంగా ఉన్నారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానం ఇస్తూ ‘ వాళ్లు ఎందుకు రాలేదో నాకు తెలుసు. మిగతా వాళ్ల మీద కన్నా నా మీదే కోపం’ అని తెలిపారు. అయితే తండ్రితో విభేదించి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ అఖిలేష్ మాత్రం తన చిన్నాన్నపై ఏ మాత్రం విశ్వాసం తగ్గలేదు సరికదా, ఆయన వల్లే తాము అధికారంలో ఉన్నప్పుడు క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేశామన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్ కూడా అఖిలేష్‌పై తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. 2022లో తిరిగి అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచి పని చేయాలంటూ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహంగా ఉన్న విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం కోసం ములాయం సింగ్, అఖిలేష్ మధ్య జరిగిన పోరులో అఖిలేషే పై చేయి సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. -
‘ఆ ఇద్దరి’కే పరిమితమైన ములాయం
లక్నో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఈసారి నామమాత్రపు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆయన కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేశారు. 2012 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, 300 ర్యాలీల్లో పాల్గొన్న ములాయం ఈసారి తన సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణ యాదవ్ తరఫున మాత్రమే క్యాంపెయినింగ్ చేశారు. కాగా కాంగ్రెస్‌తో పొత్తు పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ తరఫున కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో సోదరుడు శివ్‌పాల్‌యాదవ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్ నియోజకవర్గంతో పాటు చిన్న కోడలు అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్న లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఆయన ప్రచారం చేశారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా పెద్దాయన కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌లో ఇప్పటివరకూ ఐదు దశలు పూర్తికాగా, మరో రెండు దశల పోలింగ్ ఈ నెల 4, 8వ తేదీల్లో జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
అఖిలేశ్ సీఎం అయితే ఆయనే మంత్రి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని, ఈ కొత్త ప్రభుత్వంలోనూ తన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మంత్రిగా కొనసాగుతారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 'బంఫర్ మెజారిటీతో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తుంది. అఖిలేశ్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు' అని ఆయన ఆదివారం ఎటావా జిల్లా సాఫైలో ఓటు వేసిన అనంతరం పేర్కొన్నారు. అబ్బాయి అఖిలేశ్ యాదవ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ మధ్య పార్టీ ఆధిపత్యం కోసం తీవ్రస్థాయి పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో ములాయం తమ్ముడు శివ్‌పాల్ వైపు నిలిచినా.. ఆఖరికీ అఖిలేశ్ విజయం సాధించి.. పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా శివ్‌పాల్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. అయితే, అఖిలేశ్ విమర్శలను ములాయం తోసిపుచ్చారు. పార్టీని దెబ్బతీయాలనుకున్న కొందరిని ఉద్దేశించి అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారని, శివ్‌పాల్ గురించి కాదని పేర్కొన్నారు. అఖిలేశ్ కొత్త ప్రభుత్వంలోనూ శివ్‌పాల్ మంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు. -
నేనే సమాజ్‌వాదీ చీఫ్
-
నేనే సమాజ్‌వాదీ చీఫ్
అఖిలేశ్ కేవలం సీఎం.. శివపాల్ రాష్ట్ర అధ్యక్షుడు ♦ తేల్చి చెప్పిన ములాయం సింగ్ యాదవ్ ♦ ఈ నెల 17 లోపే తేలకపోతే ‘గుర్తు’ స్తంభించే అవకాశాలు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పార్టీకి తానే జాతీయ అధ్యక్షుడినని ములాయం సింగ్ యాదవ్ ఆదివారం స్పష్టంచేశారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా ములాయం పేర్కొన్నారు. అఖిలేశ్ మద్దతుదారుడైన రాంగోపాల్ యాదవ్‌పై ములాయం మండిపడ్డారు. ‘డిసెంబర్ 30నే రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాం. జనవరి 1న ఏ హోదాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆయన (రాంగోపాల్) నిర్వహిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నేతలు అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలోని వైరివర్గాలకు ఎన్నికల గుర్తు ‘సైకిల్’పై తమ వాదనలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువుకు ఒకరోజు ముందు ములాయం ఈ మేరకు తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడంపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా విలేకరుల ప్రశ్నలకు పూర్తిగా, ఓపికగా సమాధానాలిచ్చే ములా యం.. ఆదివారం సమావేశంలోమాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. మీడియా ప్రతినిధులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అఖిలేశ్‌కు మద్దతుగా ఎందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా చెల్లవన్నారు. కాగా, అమర్ సింగ్‌కు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. రాజీ మాటే లేదు: రాంగోపాల్ అయితే ఇరు వర్గాల మధ్య రాజీ జరుగుతోందంటూ వచ్చిన వార్తలను రాంగోపాల్ యాదవ్ ఖండించారు. కొందరు నేతాజీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ములాయంను పార్టీ మార్గదర్శకుడిగా, అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా పార్టీ జాతీయ కార్యవర్గం ఎన్నుకుందని గుర్తుచేశారు. కాగా, ఢిల్లీ బయలుదేరేముం దు లక్నోలో పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. ‘అఖిలేశ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతుంది. అయితేనేం. అఖిలేశ్ నా కుమారుడేగా’ అని వ్యాఖ్యానించినట్లు తెలి సింది. కాగా, ఈనెల 17లోగా పార్టీ గుర్తు సైకిల్‌పై ఈసీ నిర్ణయానికి రాలేని పక్షంలో ఆ గుర్తును స్తంభింపజేసే అవకాశాలున్నాయి. -
భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్‌ల వివాదం
సమాజ్‌వాద్ అధికార పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీట్ల పంపకం విషయంలో మళ్లీ తారాస్థాయికి వెళ్తోంది. టిక్కెట్ల పంపిణీల్లో బాబాయి శివ్‌పాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ల విషయంలో బెంగ పడొద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చిన అఖిలేష్, 403 మంది అభ్యర్థులతో కూడిన సొంత జాబితాను తయారుచేసి బాబాయి శివ్‌పాల్‌కు పంపించారు. అయితే ఆ జాబితాపై శివపాల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని శివ్ పాల్ తేల్చిచెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ జాబితాలోనే బుందేల్ ఖండ్‌లోని రెండు స్థానాల నుంచి తాను పోటీచేయనున్నట్టు అఖిలేష్ తెలిపారు. బబినా, మహోబ నుంచే అఖిలేష్ పోటీచేస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపక బాధ్యతలను రాష్ట్ర పార్టీ చీఫ్ శివ్‌పాల్ నిర్వహిస్తున్నారు. ఈ పంపక విషయంలో తనకు ఇష్టంలేని వారికి, క్రిమినల్స్‌కు బాబాయ్ టిక్కెట్లు ఇస్తారని అఖిలేష్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకిష్టమైన వారితో సొంత జాబితా సిద్ధం చేసి శివ్‌పాల్‌కు పంపించారు. కానీ అఖిలేష్ పంపిన జాబితాపై శివ్‌పాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చు రేపుతోంది. -
సమాజ్‌వాదీ పార్టీలో కొత్త ట్విస్ట్
-
నాన్న, బాబాయితో కమ్యూనికేషన్స్ కట్!
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తన కేబినెట్లోని ఇద్దరు మంత్రులపై వేటు వేయడం, స్వయనా తన బాబాయి అయిన శివ్‌పాల్ యాదవ్ మంత్రిత్వశాఖలకు ఎసరుపెట్టడంతో భగ్గుమన్న ఈ అంతర్గత కుమ్ములాట 48 గంటలైనా ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. ఎస్పీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో సంక్షోభానికి తెరవేసేందుకు శుక్రవారం ములాయం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటుచేశారు. శివ్‌పాల్ యాదవ్ బుధవారం తన అన్న, పార్టీ చీఫ్ ములాయంతో నాలుగు గంటలపాటు భేటీ అయినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. తన మంత్రిత్వశాఖలకు కోత పెట్టిన అఖిలేశ్ కేబినెట్లో పనిచేసేందుకు శివ్‌పాల్ ససేమిరా అంటున్నట్టు సమాచారం. తమ్ముడిని బుజ్జగించేందుకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి కొడుకు అఖిలేశ్‌ను తప్పించి.. శివ్‌పాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియమాకంతో మరింత భగ్గుమన్న అఖిలేశ్ బాబాయి శాఖలకు కోత పెట్టి షాక్ ఇచ్చారు. దీంతో మొదలైన హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ఎస్పీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే, ఇది కుటుంబ పోరాటం కాదని, ప్రభుత్వ పోరాటమని సీఎం అఖిలేశ్ పేర్కొన్నారు. 'ఔట్ సైడర్' (బయటి వ్యక్తి) వల్లే ఈ వివాదం మొదలైందని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 3 నుంచి పార్టీ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్టు ప్రకటించిన అఖిలేశ్ తాజా వివాదం విషయంలో ఎంతమాత్రం వెనకకు తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చారు. ఇటు బాబాయితోనే కాదు, అటు తండ్రి ములాయంతోనూ ఆయన కమ్యూనికేషన్స్ కట్ చేశారు. సంక్షోభ నివారణకు ఢిల్లీకి పిలిచినా ఆయన వెళ్లలేదు. ఢిల్లో ఉన్న తండ్రిని కలిసే ప్రయత్నం అఖిలేశ్ చేయకపోవడంతో ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎస్పీపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.