'ఓటు వేయడానికి వస్తే నరికేస్తాం' | ISIS Calls For 'Slaughter' Of Voters In US On Election Day: Terrorist Monitoring Group | Sakshi
Sakshi News home page

'ఓటు వేయడానికి వస్తే నరికేస్తాం'

Published Sun, Nov 6 2016 5:52 PM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

'ఓటు వేయడానికి వస్తే నరికేస్తాం' - Sakshi

'ఓటు వేయడానికి వస్తే నరికేస్తాం'

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓట్లు వేయడానికి వెళ్లే ఆ దేశ పౌరులను నరికేస్తామని ఐసిస్ హెచ్చరించింది. అంతేకాకుండా ముస్లిలను ఓటింగ్ కు దూరంగా ఉండాలని కూడా కోరినట్లు యూఎస్ కు చెందిన ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూప్ పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ఉగ్రవాదులు అమెరికాలోకి చొరబడ్డారని చెప్పింది. 

ఇందుకు సంబంధించిన ఏడు పేజీల మ్యానిఫెస్టోని అమెరికాలోని ఓ దినపత్రిక ప్రచురించింది. ఎన్నికల వేళ బ్యాలెట్ బాక్సులను కూడా ధ్వంసం చేయాలని ఐసిస్ ఉగ్రవాదులకు సూచించినట్లు తెలిసింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల పాలసీలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఐసిస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొంది. 

దీంతో ఫెడరల్ ప్రభుత్వ సంస్ధలు ఎన్నికల రోజు దాడిపై అలర్ట్ ను ప్రకటించాయి. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్ లలో దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఫ్ బీఐ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement