గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తతం చేసింది.
గాజా: గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తృతం చేసింది. కాల్పుల విరమణ అమలులోఉన్నా లేకున్నా, దాడులు కొనసాగుతాయని, గాజాలో హమాస్ మిలిటెంట్ల సొరంగ మార్గాల వ్యవస్థను ధ్వంసంచేసి తీరుతామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. 24రోజుల సైనిక దాడులను మరింత విస్తృతం చేసేందుకు అదనంగా 16వేలమందితో కూడిన రిజర్వ్ సైనిక బలగాన్ని సమీకరించింది. దీనితో దాడుల్లో పాల్గొంటున్న రిజర్వ్ బలగాల సంఖ్య 86వేలకు చేరింది. ఇక ఇజ్రాయెల్ ఇప్పటివరకూ జరిపిన దాడుల్లో 1,374మంది పాలస్తీనియన్లు మరణించారు.
గాజానుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడేందుకు హమాస్ నిర్మించిన సొరంగమార్గాలన్నింటినీ ధ్వంసంచేసేందుకు ఇజ్రాయెల్ కృతనిశ్చయంతోఉందని, తమ సైన్యం ఈ పనిలోనే ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.