రాష్ట్రవిభజనపై పార్లమెంటులో తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తమ కార్యాచరణలో మునిగిపోయారు.
హైదరాబాద్: రాష్ట్రవిభజనపై పార్లమెంటులో ఉన్న తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రానున్నతరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ముందుగానే తమ కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎప్పడొచ్చినా.. దానిపై తక్షణమే సభలో చర్చించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భానుప్రసాద్‌లు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి బిల్లు వచ్చినా తరువాత బిల్లుపై ఓటింగ్ ఉండదని, అభిప్రాయాలు మాత్రమే ఉంటాయాని చెప్పారు.
ఇప్పటికే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో తెలంగాణ బిల్లును అడ్డుకోనేందుకు సీమాంధ్ర ఎంపీలు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అవాస్తవాలు చెబుతూ తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమన్నారు. ప్రస్తుతం తెలంగాణ అంశంపై ప్రజాసమస్యలు ఎక్కువుగా ఉన్నందున.. సమావేశాలను ఈ నెలఖరువరుకూ జరపాలంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భానుప్రసాద్ తదితరులు కోరుతున్నారు.