జగ్దల్‌పూర్ ఎస్పీ ఆత్మహత్య | Jagdalpur SP shoots family, kills self | Sakshi
Sakshi News home page

జగ్దల్‌పూర్ ఎస్పీ ఆత్మహత్య

Published Wed, Feb 26 2014 1:25 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

జగ్దల్‌పూర్ ఎస్పీ ఆత్మహత్య - Sakshi

జగ్దల్‌పూర్ ఎస్పీ ఆత్మహత్య

చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) దేవ్‌నారాయణ్ పటేల్ (40) మంగళవారం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా ఆయన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భార్య, భర్త మృతిచెందగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. తనను సస్పెండ్ చేశారనే మానసిక వేదనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఎస్పీ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. వివరాలు..
 
     ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల కిందట ఎస్సీ దేవ్‌నారాయణ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టోపోల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో జడ్జి టోపోపై ఎస్పీ చేయి చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి సోమవారం ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు.
     తనపై సస్పెన్షన్ వేటు పడడాన్ని జీర్ణించుకోలేని దేవ్‌నారాయణ్ సర్వీసు రివాల్వర్‌తో భార్య ప్రతిమా పటేల్, కూతురు పూనమ్(11), కుమారుడు ఆయుష్(6)లను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు.
     ఈ ఘటనలో ఎస్పీతో పాటు భార్య ప్రతిమ అక్కడికక్కడే మృతిచెందారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం రాయ్‌పూర్ తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్పీ దేవ్‌నారాయణ్ ఇంట్లో పోలీసులు మంగళవారం ఓ సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఉదంతంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement