జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా... | jamesbond team to entertain in Bejawada | Sakshi
Sakshi News home page

జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా...

Published Wed, Jul 29 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

విజయ సంకేతాన్ని చూపిస్తున్న 'జేమ్స్‌బాండ్' చిత్ర యూనిట్

విజయ సంకేతాన్ని చూపిస్తున్న 'జేమ్స్‌బాండ్' చిత్ర యూనిట్

గాంధీనగర్ : ‘జేమ్స్‌బాండ్’ అల్లరి నరేష్ నగరంలో సందడి చేశాడు. థియేటర్‌లో ప్రత్యక్షమై నవ్వులు పూయించాడు. తాను జేమ్స్‌బాండ్ కాదంటూ తన భార్య అంటూ తనదైన శైలిలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జేమ్స్‌బాండ్ చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌కు చేరుకుని సందడి చేశారు. ప్రేక్షకుల కోరిక మేరకు అల్లరి నరేష్ చిత్రంలోని డైలాగులు చెప్పారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ హాస్య చిత్రలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్నారు.
 
 చిత్రం టైటిల్ కథానాయిక పాత్రతో ముడిపడి ఉందన్నారు. చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చిత్రం చూసేలా చిత్రాన్ని దర్శకులు తెరకెక్కించారన్నారు. జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా.. అంటూ ప్రేక్షకులను ప్రశ్నించారు. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు  తెలిపారు. కథానాయిక సాక్షిచౌదరి, నటులు పృథ్వీరాజ్, హేమ, నిర్మాతలు సుంకర రామబ్రహ్మం, అనీల్, కెమెరామెన్ రాము, పంపిణీదారులు సర్వేశ్వరరావు, అన్నపూర్ణ థియేటర్ అధినేత పెద్దబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement