జేఎన్‌యూ విద్యార్థినిపై విదేశీయుల గ్యాంగ్‌రేప్
జేఎన్‌యూ విద్యార్థినిపై విదేశీయుల గ్యాంగ్‌రేప్
Published Sat, Jan 21 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో 21 ఏళ్ల జేఎన్‌యూ విద్యార్థినిపై ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశీయులు సామూహిక అత్యాచారం జరిపారు. జేఎన్‌యూలో బీఏ (ఆనర్స్) రెండో సంవత్సరం చదువుతున్న ఆ బాధితురాలు.. గత వారం తన స్నేహితురాలితో కలిసి హౌజ్ ఖాస్ గ్రామంలోని ఒక పబ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన త్వాబ్ అహ్మద్ అలియాస్ సలీం (27)తో పరిచయం అయ్యింది. తన స్నేహితుడు, అఫ్ఘాన్‌కే చెందిన సులేమాన్ అహ్మదీ (31)తో కలిసి ఉంటున్న సలీం.. బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని తమ ఇంట్లో పార్టీ ఉంది రమ్మని పిలిచాడు.
ఆమె అక్కడకు వెళ్లేసరికి సలీం స్నేహితులు సులేమాన్, సిద్ధాంత్, ప్రత్యూష ఉన్నారు. ఆమె స్నేహితురాలు తిరిగి జేఎన్‌యూకు వెళ్లిపోగా, ఆమె మాత్రం సలీం ఇంటికి మళ్లీ వచ్చి అక్కడ మద్యం తాగిందని పోలీసులు తెలిపారు. తెల్లవారి లేచేసరికి సులేమాన్ తనపై బలవంతం చేస్తున్నట్లు ఆమెకు తెలిసింది. తాను మత్తులో పడి ఉన్నప్పుడు సలీం, సులేమాన్ తనపై అత్యాచారం చేసినట్లు అర్థమైంది. ఆమె జేఎన్‌యూ హాస్టల్‌కు తిరిగి వెళ్లిపోయి, జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పగా, వెంటనే వారు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సలీంతో పాటు సులేమాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Advertisement
Advertisement