రాజీనామా యోచనలో గంగూలీ | Justice Ganguly contemplating resigning as WBHRC chief | Sakshi
Sakshi News home page

రాజీనామా యోచనలో గంగూలీ

Published Sun, Jan 5 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Justice Ganguly contemplating resigning as WBHRC chief

ఢిల్లీ/కోల్కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ.. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. గంగూలీ ఈ విషయాన్ని తనకు ఫోన్లో చెప్పినట్టు మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తెలిపారు.

గంగూలీ తనను లైంగికంగా వేధించారంటూ న్యాయ విద్యార్థి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై గంగూలీ తనకు వివరించారని సోరాబ్జీ తెలిపారు. డబ్ల్యూబీహెచ్ఆర్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనుకోవడం వివేకమైన నిర్ణయమని గంగూలీకి చెప్పానని సోరాబ్జీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement