సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు గురువారం అమెరికాలోని మిచిగన్ సుప్రీంకోర్టును సందర్శించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు గురువారం అమెరికాలోని మిచిగన్ సుప్రీంకోర్టును సందర్శించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ మహా సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన వారంతా సుప్రీంకోర్టును సందర్శించి, అక్కడి విశేషాలను తెలుసుకున్నారు.
మిచిగన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రయన్ జార, చీఫ్ జస్టిస్ రాబర్టు యంగ్ జూనియర్ వీరికి ఘనస్వాగతం పలికారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాస్ తదితరులు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయడమే కాక.. జస్టిస్ ఎన్వీ రమణ, డాక్టర్ కోడెల శివప్రసాదరావులను దగ్గరుండి తీసుకెళ్లారు.