
జడ్జిపై విమర్శలు చేసిన లాయర్ అరెస్ట్
కడళూరు: తమిళనాడులో అన్నాడీఎంకే తరపు న్యాయవాది తంగ కొలాంజినాథన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా వెలువరించిన తీర్పును విమర్శినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కున్హా తీర్పును విమర్శిస్తూ తిక్కకుడిలో బేనర్ పదర్శించడమే కాకుండా, ఆయనపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. జయలలితకు న్యాయం జరగలేదని, అన్యాయం విజయం సాధించిందంటూ కొలాంజినాథన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధిపై కూడా ఆయన విమర్శలు చేశారు.