పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజల్ని, పార్టీల్ని దబాయింపుతో నోరు మూయించాలని చూడొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వామపక్షాలు హితవు పలికాయి.
వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజల్ని, పార్టీల్ని దబాయింపుతో నోరు మూయించాలని చూడొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వామపక్షాలు హితవు పలికాయి. వెంకయ్యనాయుడును ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయమని తాము కోరడంలేదని.. గతంలో ఆయన పోటీకి దిగితే ఏం జరిగిందో ప్రజలకు గుర్తుందని మండిపడ్డాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు గురువారం వేర్వేరు ప్రకటనలు చేశాయి.
‘ప్రత్యేక హోదా తెస్తామని, ఇస్తామని ఊరూరా సన్మానాలు చేయించుకున్న వెంకయ్య.. ఇప్పుడు దిష్టిబొమ్మలు దహనం చేస్తామంటే ఆక్రోశం వెల్లగక్కడం సమంజసమేనా’ అని ప్రశ్నించాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న ఆగ్రహంతోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని, అదే జాబితాలో చేరాలనుకుంటే బీజేపీ కూడా ఇచ్చిన మాటను విస్మరించవచ్చని హెచ్చరించాయి.