సాక్షి, హైదరాబాద్: బుక్ చేసిన మూడు నెలలలోపే ఇంటి తాళాలు చేతికిస్తామంటోంది లోటస్ ప్రాపర్టీస్. మార్చి నెలాఖరులోగా నిర్మాణం పూర్తికానున్న ‘లోటస్ రోల్డానా’ లగ్జరీ ప్రాజెక్ట్ వివరాలను సంస్థ చైర్మన్ బి.సుధాకర్‌రావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. వివరాలివీ...
‘‘బడా బడా షాపింగ్ మాల్స్, విద్య, వైద్య సంస్థలు, మెరుగైన రవాణా వ్యవస్థ ఇలా అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన బంజారాహిల్స్ రోడ్ నం:5లో లోటస్ రోల్డానా పేరుతో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 2,300 - 2,500 చ.అ. విస్తీర్ణంలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, 2,900 చ.అ. విస్తీర్ణంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వెంటనే 7 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయంటే ప్రాజెక్ట్‌లోని సదుపాయాలు, ఇక్కడి అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, డ్యుయెల్ కార్ పార్కింగ్‌తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలు అందిస్తాం. త్వరలో తెల్లాపూర్‌లో 4 ఎకరాలు, నానక్‌రాంగూడలో రెండున్నర ఎకరాల్లో భారీ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’
బంజారాహిల్స్‌లో లోటస్ రోల్డానా!
Published Sat, Dec 7 2013 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement