sudhakar rao
-
కోల్లాపూర్లొ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావు ప్రచారం
-
కొల్లాపూర్‌లో నామినేషన్ వేసిన ఎల్లేని సుధాకర్ రావు
-
ఎంపీడీవో అవినీతిపై విచారణ చేపట్టండి
చిత్తూరు, రేణిగుంట: టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ మండల పరిషత్ నిధులను దోచుకుతింటున్న ఎంపీడీవో సుధాకర్‌రావు అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రేణిగుంట మండల వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు పట్టుబట్టారు. రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల మీట్‌కు వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది ఎంపీటీసీలు నల్లబ్యాడ్జీలను ధరించి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులమైన తమ హక్కులను ఎంపీడీవో కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలపై ఎంపీడీవో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన నోరు మెదపకపోవడంతో ప్రతిపక్ష ఎంపీటీసీలు సుజాత, జయలలిత, గంగారి సుజాత, అన్బుయాదవ్, నాగసుబ్రమణ్యంరెడ్డి, ముద్దురాయులు, నారాయణరెడ్డి, వెంకటయ్య, గంగమణి, జ్ఞానమ్మ మీటింగ్ హాల్లో నేలపై కూర్చుని ఎంపీడీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి మద్దతుగా పార్టీ మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సీఐ నాగరాజుయాదవ్, ఎస్ఐ మోహన్‌నాయక్ తమ సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులు, ఎంపీటీసీలతో చర్చలు జరిపారు. సుమారు గంటన్నర పాటు ఈ ఆందోళన జరిగింది. ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ లీలావతి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలను సమావేశానికి హాజరుకావాలని కోరారు. వారు ససేమిరా అనడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ స్వాతి ప్రకటించారు. దీంతో మండల స్థాయి అధికారులు వెనుతిరిగారు. అనంతరం పార్టీ నాయకులు ఎంపీడీవో కోసం జోలిపట్టి భిక్షం ఎత్తారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పై మరిన్ని చర్యలు
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ఆదివారం పోర్టికో కూలిన ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఇదే ఘటనకు సంబంధించి ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శికి విచారణకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిపై కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేసి విషయం విదితమే. ఎఫ్ఎన్సీసీ కార్యవర్గంపై సెక్షన్ 304(పార్ట్2)..? ఈ ఘటనలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న సెక్షన్లతో పాటు అదనంగా 304(పార్ట్2) సెక్షన్‌ను నమోదు చేయాలని, దర్యాప్తును ముమ్మరం చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగానే పోర్టికో నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఉందా? రాత్రి పూట శ్లాబ్ వేయాల్సిన అవసరం ఏంటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నిర్లక్ష్యంగా శ్లాబ్ నిర్మాణం చేపట్టి ఇద్దరి మరణానికి కారకులయ్యారంటూ ఇప్పటికే ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడిపై కేసు నమోదుకాగా దీని తీవ్రతను పెంచాలని యోచిస్తున్నారు. -
ఎర్రబెల్లితో కలిసి పనిచేయాలంటే...
కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం టీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్‌రావు కొడకండ్ల : పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పనిచేయాలంటే తమకు సందేహాలు ఉన్నాయని పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ సుధాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి చాలా సంవత్సరాల నుంచి నాయకులు, కార్యకర్తలు శ్రమించారని, అలాంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నందున తమ సందేహాలు నివృత్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో గురువారం వడ్డెకొత్తపల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ అనంతరం సుధాకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఎర్రబెల్లితో తమకు గత చేదు అనుభవాలున్నాయని, 2009లో జరిగిన ఎన్నికల్లో ఎర్రబెల్లిని గెలిపిస్తే తన అనుచరులను పూర్తిగా విస్మరించి అన్యాయం చేశాడని, ప్రభుత్వం లేనప్పుడే ఎర్రబెల్లి కక్ష సాధింపుకు పాల్పడ్డాడని అన్నారు. బంగారు తెలంగాణ సారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె సీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులంతా సమావేశానికి హాజరయ్యూరని, కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాధనకు కృషి చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోరుునా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నానని, ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దయాకర్‌కు 36 వేల ఓట్ల మేజారిటీని అందించామన్నారు. ఎర్రబెల్లిని చేర్చుకోవడం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా ఎర్రబెల్లిని ప్రశ్నించే హక్కు తమకున్నదని సుధాకర్‌రావు అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు బాకి లలిత, జాటోత్ కమలాకర్, బానోత్ జ్యోతి, కర్నె సోమయ్య, మండలాల పార్టీ అధ్యక్షులు యాదగిరిరావు, రాంబాబు, రమేష్, కుమార్, నర్సింహనాయక్, గాంధీనాయక్‌తో పాటు ముఖ్య నాయకులు, 42 మంది సర్పంచ్‌లు, 39 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్!
విద్యుత్ జేఏసీ నోటీసు అందజేత.. 3న ‘చలో విద్యుత్ సౌధ’ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కోలకు నోటీసు ఇచ్చింది. 2014 పీఆర్సీని వెంటనే వర్తింపజేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ ఏ.సుధాకర్‌రావు సారధ్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సాయంత్రం టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావును కలిసి సమ్మె నోటీసు అందించారు. సమ్మెలో భాగంగా డిసెంబరు 3 న ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, అదేరోజున భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు. -
సుధాకర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం
తొర్రూరు : ఐమెడికా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాలకుర్తి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సుధాకర్‌రావు వరంగల్ కేఎంసీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కళాశాలల్లో ఇంటర్నల్ మెడిసన్‌లో ఎండీ పూర్తి చేశారు. పీజీఐ చండీగఢ్‌లో డీఎం (ఎండోక్రినోలజీ ) పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో ఎండోక్రినోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, యశోద, కామినేని ఆస్పత్రుల్లో కన్సల్టెం ట్‌గా, హైదరాబాద్ సొసైటీఆఫ్ ఎండోక్రినోలజీకి అధ్యక్షుడిగా, ఏఐఏఏఆర్ఓకు ఉపాధ్యక్షుడితోపాటు రెండు దశాబ్దాలపాటు వైద్య, విద్య, బోధన రంగంలో ప్రజలకు చేసిన సేవలు, పరిశోధనలకు గుర్తిం పుగా ఈ అవార్డును అందజేశారు. నిమ్స్ వైద్యులు శాంతరావు, బీఫిన్, ఆర్కే. సాయో, వసంతకుమార్ చేతుల మీదుగా డాక్టర్ సుధాకర్‌రావు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఐదుగురు డాక్టర్లకు జీవిత సాఫల్య పురస్కారం దక్కిందన్నారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
ఎందర్ని బలిగొంటడో..!
జమ్మికుంట టౌన్, న్యూస్‌లైన్: జమ్మికుంట ప్రభుత్వాస్పత్రి వైద్యుడు సుధాకర్‌రావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓవైపు సర్కారు నుంచి జీతభత్యాలు తీసుకుంటూ.. మరోవైపు పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులను దొంగచాటుగా తన ఆస్పత్రికి తరలించడం, ఆపై వారి ప్రాణాలతో చెలగాటమాడడంపై విమర్శలు వస్తున్నాయి. పట్టణంలో తాను నిర్వహిస్తున్న మమత నర్సింగ్‌హోంలో బుధవారం మండలంలోని వాగొడ్డురామన్నపల్లికి చెందిన కారట్లపల్లి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ చనిపోయినా వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు లాగేందుకు యత్నించి.. పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చాడని పలువురు విమర్శిస్తున్నారు. కారట్లపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం విషం తాగగా, కుటుంబసభ్యులు అతడిని మొదట జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అక్కడ ఉన్న సిబ్బంది డ్యూటీ డాక్టరైన సుధాకర్‌రావు కు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన సుధాకర్‌రావు అతడికి కడుపును శుభ్రంగా కడిగి ఓపీ నంబర్ 4,447 అని రిజిస్టర్లో రాసుకున్న తర్వాత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని తన సొంత ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందిస్తానని బంధువులతో చెప్పాడు. ఎంజీఎంకు వెళ్లాల్సిన శ్రీనివాస్‌ను పట్టణంలో తాను నిర్వహిస్తున్న మమత నర్సింగ్ హోమ్‌కు తరలించాడు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక శ్రీనివాస్ ప్రాణాలు గాల్లో కలిశాయి. గతంలో ఇదే ఆస్పత్రిలో ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల బంధువులు ఆందోళన చేస్తే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల దాకా చెల్లించి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులకు సైతం భారీ మొత్తంలో ముడుపులు అందజేయడం వల్లనే సుధాకర్‌రావును ఎవరూ ఏమీ అనడం లేదని పలువురు బహిరంగం గా చర్చించుకుంటున్నారు. సుధాకర్‌రావు ఇల్లందకుంట ఆస్పత్రిలో పనిచేసిన సమయంలోనూ విధులకు సక్రమంగా హాజరుకాకుండా తన సొంత ఆస్పత్రికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాడు. క్రిమిసంహారక మందు తాగిన కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తే.. వారికి మాయమాటలు చెప్పి పట్టణంలోని తన ఆస్పత్రికి తరలించేవాడని పలువురు పేర్కొం టున్నారు. గతంలో హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో విధులకు సక్రమంగా హాజరుకాకపోగా మత్తు ఇంజక్షన్ ఇచ్చేం దుకు లేటుగా వెళ్లడంతో అక్కడ ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అప్పటి జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సుధాకర్‌రావు జమ్మికుంటలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని తనిఖీ చేసి అవాక్కయ్యా రు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించగా, అప్పుడు సుధాకర్‌రావు సస్పెండయ్యాడు. తర్వాత ఉన్నతాధికారులు మారడంతో తన పలుకుబడిఉపయోగించి తిరిగి జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలోనే పోస్టింగ్ తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి ఉన్నతాధికారుల వద్ద అతడికి ఏమేరకు పలుకుబడి ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్య వృత్తికి కళంకం తెస్తున్న డాక్టర్ సుధాకర్‌రావుపై కొరడా ఝులిపించాల్సిన అవసరం ఉంది. -
బంజారాహిల్స్‌లో లోటస్ రోల్డానా!
సాక్షి, హైదరాబాద్: బుక్ చేసిన మూడు నెలలలోపే ఇంటి తాళాలు చేతికిస్తామంటోంది లోటస్ ప్రాపర్టీస్. మార్చి నెలాఖరులోగా నిర్మాణం పూర్తికానున్న ‘లోటస్ రోల్డానా’ లగ్జరీ ప్రాజెక్ట్ వివరాలను సంస్థ చైర్మన్ బి.సుధాకర్‌రావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. వివరాలివీ... ‘‘బడా బడా షాపింగ్ మాల్స్, విద్య, వైద్య సంస్థలు, మెరుగైన రవాణా వ్యవస్థ ఇలా అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన బంజారాహిల్స్ రోడ్ నం:5లో లోటస్ రోల్డానా పేరుతో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 2,300 - 2,500 చ.అ. విస్తీర్ణంలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, 2,900 చ.అ. విస్తీర్ణంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వెంటనే 7 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయంటే ప్రాజెక్ట్‌లోని సదుపాయాలు, ఇక్కడి అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, డ్యుయెల్ కార్ పార్కింగ్తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలు అందిస్తాం. త్వరలో తెల్లాపూర్‌లో 4 ఎకరాలు, నానక్‌రాంగూడలో రెండున్నర ఎకరాల్లో భారీ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’