తొర్రూరు : ఐమెడికా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాలకుర్తి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సుధాకర్‌రావు వరంగల్ కేఎంసీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కళాశాలల్లో ఇంటర్నల్ మెడిసన్‌లో ఎండీ పూర్తి చేశారు.
పీజీఐ చండీగఢ్‌లో డీఎం (ఎండోక్రినోలజీ ) పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో ఎండోక్రినోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా, యశోద, కామినేని ఆస్పత్రుల్లో కన్సల్టెం ట్‌గా, హైదరాబాద్ సొసైటీఆఫ్ ఎండోక్రినోలజీకి అధ్యక్షుడిగా, ఏఐఏఏఆర్‌ఓకు ఉపాధ్యక్షుడితోపాటు రెండు దశాబ్దాలపాటు వైద్య, విద్య, బోధన రంగంలో ప్రజలకు చేసిన సేవలు, పరిశోధనలకు గుర్తిం పుగా ఈ అవార్డును అందజేశారు.
నిమ్స్ వైద్యులు శాంతరావు, బీఫిన్, ఆర్‌కే. సాయో, వసంతకుమార్ చేతుల మీదుగా డాక్టర్ సుధాకర్‌రావు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఐదుగురు డాక్టర్లకు జీవిత సాఫల్య పురస్కారం దక్కిందన్నారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సుధాకర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం
Published Wed, Jul 30 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement