సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం | Maha CM travels by Mumbai's lifeline; interacts with commuters | Sakshi
Sakshi News home page

సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం

Published Mon, Dec 29 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం

సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సబర్బన్ రైల్లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దక్షిణ ముంబైలోని కొలబాలో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ)లో సాయంత్రం 6.29 నిమిషాలకు కళ్యాణ్ ఫాస్ట్ రైలు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రద్దీ సమయంలో రైల్లో ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సీఎంతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మరికొందరైతే తమ బంధువులకు ఫోన్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడించి ఆనందపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement