మజ్నూ రిటర్న్స్: 50 మంది అరెస్టు
గూర్గావ్ : "మజ్నూ రిటర్న్స్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన 50 మంది ఈవ్ టీజర్లను గూర్గావ్ పోలీసులు అరెస్టు చేశారు. మేహరౌలీ-గూర్గావ్ రోడ్డులో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం ఒకటింటి వరకు మహిళా పోలీసులు సాధారణ దుస్తులతో మజ్నూ రిటర్న్స్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా ఎంజీ రోడ్డులో, సహారా మాల్ బయట, మెట్రో స్టేషన్లలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పురుషులను గుర్తించామని, వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
గతేడాది ఇలాంటి డ్రైవ్లతో 250 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చివరి డ్రైవ్ డిసెంబర్లో జరిగింది. పోలీసులు నిర్వహించే ఈ డ్రైవ్కు పెట్టిన పేరు మజ్నూను ప్రేమకు చిహ్నమైన లైలా-మజ్నూ నుంచి ప్రతిపాదించినట్టు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం యువకులు లైంగిక ఆసక్తి, ప్రేమ పేరుతో మహిళలను వేధిస్తున్నారని, వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారినుంచి మహిళలను కాపాడేందుకే ఈ డ్రైవ్లు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.