న్యూఢిల్లీ: ‘శారద కుంభకోణం’లో సీబీఐ దర్యాప్తు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వరకు వచ్చేలా కనిపిస్తోంది. ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీతో శారద సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంపై సీబీఐ దృష్టి సారిస్తోంది. రైల్వే మంత్రిగా మమత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘భారత్ తీర్థ’ ప్రాజెక్టుకు సంబంధించి టూర్ ప్యాకేజ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలో శారద ఒకటి కావడంతో.. సీబీఐ కూపీ లాగుతోంది.
దేశంలోని 10 పుణ్యక్షేత్రాలకు తక్కువ ధరలో ఆహార, వసతి సౌకర్యాలు కల్పిస్తూ 16 రైలు సర్వీసులను ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించారు.