
కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఎదుట కరెంటు షాక్ తగిలి ఓవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీపై కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తెగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.