మణిపాల్: ప్రఖాత క్వాక్వారెల్లీ సైమండ్స్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్–2018లో మణిపాల్ వర్సిటీ ఉత్తమ ర్యాంకులు సాధించింది. భారత్‌లో అత్యుత్తమ విద్యనందిస్తున్న ప్రైవేటు వర్సిటీలకు ఇచ్చే 701–750 బ్యాండ్‌లో మణిపాల్ వర్సిటీ స్థానం దక్కించుకుంది. మొత్తంగా చూస్తే భారత్‌లోని వర్సిటీల్లో 13వ ర్యాంక్ సాధించింది.
ఈ ఏడాది 84 దేశాలకు చెందిన 950 యూనివర్సిటీలకు క్వాక్వారెల్లీ సైమండ్స్ వర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వర్సిటీల్లో ర్యాంకింగ్‌లో తొలి 2.7శాతం వర్సిటీల్లో మణిపాల్ వర్సిటీ సైతం ఉంది. యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ సంపాదించడం ద్వారా విద్యారంగంలో గొప్ప మైలురాయిని దాటామని మణిపాల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్ వినోద్ భట్ వ్యాఖ్యానించారు.
మణిపాల్ వర్సిటీకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకులు
Published Sat, Jun 10 2017 3:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
Advertisement