కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే! | Manipur Congress MLA joins BJP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే!

Published Tue, Apr 18 2017 12:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే! - Sakshi

కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే!

మణిపూర్‌లో ఎక్కువ సీట్లు సాధించినా అధికార పీఠానికి దూరంగా ఉండిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జిన్సుయన్హా మంగళవారం బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మరింత సంఖ్యాబలం లభించినట్టయింది.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు జిన్ముయన్హా సోమవారం చెప్పిన సంగతి తెలిసిందే. ఇంఫాల్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క‌్ష భబానందసింగ్‌ సమక్షంలో ఆయన పార్టీలో లాంఛనంగా చేరారు.

60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 28 స్థానాలు గెలిచి.. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయినా, 21 స్థానాలు మాత్రమే గెలుపొందిన బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎన్పీపీ, ఎన్పీఎఫ్‌, ఎల్జేపీతో ఎమ్మెల్యేల మద్దతుతోపాటు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లకు ఒక్కొక్క ఎమ్మెల్యేల సహకారం తీసుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. సంకీర్ణ కూటమికి ఇబ్బందులు ఎదురుకాకుండా బీజేపీ కాంగ్రెస్‌ నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement