భారత్ - చైనా సరిహద్దు రక్షణ ఒప్పందం | Manmohan Singh, Li Keqiang sign landmark Indo-China border pact | Sakshi
Sakshi News home page

భారత్ - చైనా సరిహద్దు రక్షణ ఒప్పందం

Published Wed, Oct 23 2013 11:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Manmohan Singh, Li Keqiang sign landmark Indo-China border pact

చైనాతో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం ( బీడీసీఏ)పై సంతకం చేసినట్లు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ప్రధాని లి కెషాంగ్తో మన్మోహన్ సింగ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఇరుదేశాల ప్రధానులు మీడియా ఎదుట మాట్లాడారు. చైనాతో ప్రధానితో భేటీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని మన్మోహన్ వివరించారు. అలాగే తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చైనాతో కలసి పని చేస్తామన్నారు.

 

మన్మోహన్ పాలనలో భారత్, చైనా సంబంధాలు త్వరితగతిన మరింత మెరుగుపడటమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతాయని చైనా ప్రధాని లి కెషాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్తో జరిగిన భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాకిక్ష సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించినట్లు చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు  మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం చైనా చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement