చైనా ప్రధానితో మన్మోహన్ భేటీ | Manmohan Singh, Li Keqiang begin talks in Beijing | Sakshi
Sakshi News home page

చైనా ప్రధానితో మన్మోహన్ భేటీ

Published Wed, Oct 23 2013 9:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Manmohan Singh, Li Keqiang begin talks in Beijing

భారత్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్  చైనా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఆ దేశ ప్రధాని లి కెకియాంగ్తో భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య వివిధ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ విషయాలు ఆ భేటీలో చర్చకు రానున్నాయి. అంతకు ముందు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో సింగ్ గార్డ్ ఆఫ్ హానర్ గౌరవాన్ని అందుకున్నారు. ఈ భేటీలో భాగంగా బోర్డర్ డిఫెన్స్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ ( బీడీసీఏ)  పై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.


మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం రాత్రి చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. మన్మోహన్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... పోరుగు దేశమైన చైనాతో భారత్కు గల శతాబ్దాల బంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement