షరీఫ్తో భేటీ అవుతా: మన్మోహన్
అమెరికా పర్యటన సందర్భంగా తాను పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ ఫరీఫ్ తో భేటీ కానున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్రువీకరించారు. వారం రోజుల పర్యటన నిమిత్తం బుధవారం న్యూయార్క్ బయలుదేరి వెళ్లేముందు చేసిన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. పాక్ సహా బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాల అధినేతలతో ద్వైపాక్షి సమావేశాల కోసం వేచిచూస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 29న న్యూయార్క్‌లో మన్మోహన్, షరీఫ్ ల భేటీ జరగవచ్చని భావిస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి అనారిగక సంఘటనలు, ఉగ్రవాదం కొనసాగడంపై భారత్ ఆందోళనను మన్మోహన్ పాక్ కొత్త ప్రధానమంత్రికి తెలియజేస్తారని భావిస్తున్నారు.
భవిష్యత్ సహకారానికి బాటలు
వాణిజ్యం, పెట్టుబడులు, రణ వంటి పలు రంగాల్లో ద్వైపాక్షి సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ సహకారానికి కార్యాచరణ రూపకల్పన లక్ష్యంగా ప్రధాని అమెరికా పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా వాషింగ్టన్ లో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మన్మోహన్ సమావేశమై చర్చలు జరుపుతారు.తర్వాత న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరవుతారు.
ఒబామా, మన్మోహన్ ల భేటీ 27న జరగనుండగా ఇతర అంశాలతో పాటు పౌర అణు ఒప్పందం అమలు కూడా ప్రధాన ఎజెండాగా ఉండనుంది. భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపించే అమెరికా వీసా నిబంధనల్లో మార్పు ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధాని ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పల ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయనున్నారు. న్యూఢిల్లీ నుంచి బుధవారం రాత్రి జర్మనీ చేరుకున్న ప్రధాని గురువారం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బయలుదేరి అమెరికా వెళతారు.