అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం | Mars Orbitor Mission: Satellite in fourth stage, performing | Sakshi
Sakshi News home page

అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం

Published Tue, Nov 5 2013 3:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం

అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం

సూళ్లూరుపేట :  శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారక యాత్ర విజయవంతంగా నాలుగు దశలను పూర్తి చేసుకుంది. కీలక మైన నాలుగో దశను విజయవంతంగా దాటింది.  లక్షిత వేగంతో దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ సి 25 గురించి సమాచారం అందినట్లు షార్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత కీలకమైన పీఎస్-4 ఇంజిన్ ప్రారంభమైందని వారు తెలిపారు.

 కాగా అంతకు ముందు  ప్రయోగానంతరం  మార్స్ ఆర్బిటర్ మిషన్ భూమి చుట్టూ దాదాపు 5 సార్లు చక్కర్లు కొట్టింది. ఆ తరువాత అంగారక కక్ష్య మార్గంలోకి ప్రవేశించింది. ఈ చక్కర్లు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పద్ధతి ప్రకారం జరిగాయి. తొలి దశలో పెరిగీ (భూమికి అతి దగ్గరగా ఉండే దశ) దాదాపు 250 కి.మీ. ఉంటే.. అపొగీ(భూమికి అతి దూరంగా ఉండే దశ) దాదాపు 23,000 కిలోమీటర్లుంటుంది.
 
తరవాతి 4 దశల్లో పెరిగీలో పెద్ద మార్పుండదు గానీ అపొగీ మాత్రం 40,000 నుంచి దాదాపు 2 లక్షల కి.మీ వరకు పెరిగింది. ఈ దశల తరువాత ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్య మార్గంలోకి దూసుకెళ్లింది. ఇక రెండోది హీలియో సెంట్రిక్ దశ. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంగారకుడుండే నిర్దిష్ట స్థానం ఆధారంగా ఈ దశ ప్రయాణం ఉంటుంది.

ఇక అంగారక గ్రహ ప్రభావముండే ప్రాంతం (ఆ గ్రహం నుంచి 5.7 లక్షల కిలోమీటర్లు)లోకి ప్రవేశించడంతో మూడో దశ మొదలవుతుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఉపగ్రహం క్రమేపీ ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. కాగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం మొత్తం బరువు దాదాపు 1,336 కిలోలు. దీంట్లో 860 కిలోలు ఇంధనం. మిగతా బరువులో దాదాపు 15 కిలోల బరువుతో 5 శాస్త్రీయ పరికరాలుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement