తెలంగాణ అంశం కారణంగా పార్లమెంటు పని చేయకపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. లోక్సభ, రాజ్యసభ రెండూ అస్సలు పనిచేయడం లేదని, యూపీఏ ప్రభుత్వం, కేంద్రమే ఇందుకు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. తెలంగాణ కావాలని కొందరు, వద్దని కొందరు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని, దాంతో సభ కొంచెం కూడా ముందుకు నడవట్లేదని ఆమె పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
అయితే తమ పార్టీ మాత్రం తెలంగాణకు మద్దతు ఇస్తుందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి, పాలన మెరుగవుతాయని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. మరి పార్లమెంటులో ఈ అంశం కారణంగానే బిల్లులేవీ చర్చకు రావట్లేదని ప్రస్తావించగా, ప్రభుత్వం నిజంగానే బిల్లుల విషయంలో చిత్తశుద్ధితో ఉంటే, వాటిని గత ఐదేళ్లలో ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు. సభ జరగకపోవడానికి కేవలం ప్రభుత్వమే కారణమని మాయావతి అన్నారు.
తెలంగాణ రభసకు సర్కారే కారణం: మాయావతి
Published Fri, Feb 7 2014 3:37 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement