small states
-
బీజేపీ అలా... మోడీ ఇలా..!
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల విషయంలో బీజేపీ విధానానికి భిన్నంగా వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను ప్రధానిగా ఉండగా మహారాష్ట్రను విడదీయడం జరగదని మోడీ చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో కలవరం రేపాయి. చిన్న రాష్టాలకు అనుకూలమన్న బీజేపీ విధానానికి వ్యతిరేకంగా మోడీ వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ ఇరుకున పడింది. అయితే చిన్నరాష్ట్రాలే త్వరగా అభివృద్ధి సాధిస్తాయన్న తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని బీజేపీ అంటోంది. మోడీ వ్యాఖ్యలు మహారాష్ట్రకు మాత్రమే పరిమితమంటూ వివరణయిచ్చింది. మహారాష్టను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోదంటూ శివసేన ఆరోపించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
తెలంగాణ రభసకు సర్కారే కారణం: మాయావతి
తెలంగాణ అంశం కారణంగా పార్లమెంటు పని చేయకపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ అస్సలు పనిచేయడం లేదని, యూపీఏ ప్రభుత్వం, కేంద్రమే ఇందుకు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. తెలంగాణ కావాలని కొందరు, వద్దని కొందరు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని, దాంతో సభ కొంచెం కూడా ముందుకు నడవట్లేదని ఆమె పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే తమ పార్టీ మాత్రం తెలంగాణకు మద్దతు ఇస్తుందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి, పాలన మెరుగవుతాయని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. మరి పార్లమెంటులో ఈ అంశం కారణంగానే బిల్లులేవీ చర్చకు రావట్లేదని ప్రస్తావించగా, ప్రభుత్వం నిజంగానే బిల్లుల విషయంలో చిత్తశుద్ధితో ఉంటే, వాటిని గత ఐదేళ్లలో ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు. సభ జరగకపోవడానికి కేవలం ప్రభుత్వమే కారణమని మాయావతి అన్నారు. -
చిన్న రాష్ట్రాలకే ‘ఆప్’ ఓటు
ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ తెలంగాణకు న్యాయం జరగనందునే ఈ పరిస్థితి లోక్‌సత్తా విలీనంపై చర్చలు కొనసాగుతున్నాయి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమేనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సంకేతమిచ్చింది. అధికార వికేంద్రీకరణను విశ్వసించే తమ పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఏళ్లతరబడి పాలించిన నాయకుల వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని ఆరోపించారు. విభజనతోనే తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని, గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులకు తాము విముఖమని పేర్కొన్నారు. ఆప్‌లో లోక్‌సత్తా పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే దీనిపై మాట్లాడ్డం తొందరపాటవుతుందన్నారు. ‘జాతీయ రాజకీయాల్లోకి ఆప్’ అంశంపై శనివారమిక్కడి ఏవీ కాలేజీలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. విభజనను పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తున్నాయే తప్ప ప్రజల కోణంలో కాదు. ఏపీలోని అన్ని ప్రాంతాల హక్కుల కోసం మేం పోరాడతాం. ఏపీలో మా పార్టీలో లక్ష మంది చేరారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కమిటీ ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. రెండు ప్రాంతాల్లోనూ పోటీ చేస్తాం. దేశంలో అవినీతే ప్రధాన సమస్య. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థకు కొమ్ము కాస్తున్నాయి. ప్రజాధనాన్ని రిలయన్స్ లాంటి సంస్థల జేబులు నింపేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయాల్లో అవినీతి, ఆశ్రీతపక్షపాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, టంకశాల అశోక్, ఆప్ రాష్ట్ర నేతలు రామకృష్ణరాజు, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నటులు శివాజీ తదితరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణరాజు అధ్యక్షతన స్నేహలత, విజయ్‌ప్రకాశ్, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, ఉమాశంకర్, వినోద్‌కుమార్, ఎంజే థామస్, ఆర్షద్లతో ఆప్ రాష్ట్ర సమన్వయ కమిటీని ప్రకటించారు. ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ నాగార్జునా హిల్స్‌లో ఆప్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. సమావేశం రసాభాస ‘జాతీయ రాజకీయాల్లోకి ఆప్’ అంశం పై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆప్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రశాంత్ భూషణ్ చెప్పడంతో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీని పై సీమాంధ్ర ప్రతినిధులు అభ్యంత రం వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో ఆప్‌లో 20 వేల మందిని చేర్పించాం. పార్టీ తెలంగాణకు అనుకూలమంటే ప్రజల్లోకి ఎలా వెళ్లగ లం?’ అని నిలదీశారు. దీంతో ఉద్రితక్త తలెత్తింది. ఇరు ప్రాంతాల ప్రతినిధులు తోపులాటకు దిగారు. పార్టీ నేతలు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత బీజేవైఎం నేతలు అక్కడికొచ్చి.. కాశ్మీర్‌పై రిఫరెండమ్ నిర్వాహించాలన్న ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు. ఆప్‌లో విలీనంపై చర్చలు జరపడం లేదు: లోక్‌సత్తా ఆప్‌లో తమ పార్టీ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలూ జరగడం లేదని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏపీలో లోక్‌సత్తా పార్టీ సారథ్యంలో రెండు పార్టీలూ పనిచేయాలన్న దానిపైనే యోచిస్తున్నామని ‘సాక్షి’తో అన్నారు. -
ఆంటోని కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటా: డొక్కా
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ విధేయుడని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ఆంటోని కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రల ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం, హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి శిరసావహిస్తానని మాణిక్యవర ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు కోండ్రు మురళి, బాలరాజు సమర్థించిన విషయం తెలిసిందే. సీఎం లేవనెత్తిన అంశాలను ఆంటోనీ కమిటీలో చర్చిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. -
చిన్నరాష్ట్రాలతో అభివృద్ధికి ఆటంకం
రాయచోటి, న్యూస్‌లైన్: పెద్ద రాష్ట్రాలను ముక్కలు చేసి చిన్నచిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం వలన ఆర్థిక ఇబ్బందులతో పాటు అభివృద్ది కూడా కుంటుపడుతుందని లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యేలు గడికోట ద్వారకనాథరెడ్డి, గడికోట మోహన్‌రెడ్డిలు అభిప్రాయపడ్డారు. రంజాన్ సందర్భంగా పాలన్నగారిపల్లె, ఉడుంవారిపల్లె, చిట్లూరు గ్రామాలలో శుక్రవారం ముస్లిం మైనార్టీలకు వారు శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఖండించారు.