ఆంటోని కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటా: డొక్కా | I am bound by the Anthony committee report: dokka manikya varaprasad | Sakshi
Sakshi News home page

ఆంటోని కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటా: డొక్కా

Published Sat, Aug 10 2013 3:30 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

I am bound by the Anthony committee report: dokka manikya varaprasad

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ విధేయుడని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ఆంటోని కమిటీ ఇచ్చే నివేదికకు  కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రల ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం, హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి శిరసావహిస్తానని మాణిక్యవర ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర విభజనపై  ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు కోండ్రు మురళి, బాలరాజు సమర్థించిన విషయం తెలిసిందే. సీఎం లేవనెత్తిన అంశాలను ఆంటోనీ కమిటీలో చర్చిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement