అఖిలేశ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌! | minister KTR comment on akhilesh yadav | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌!

Published Tue, Mar 7 2017 7:14 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

అఖిలేశ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌! - Sakshi

అఖిలేశ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌!

తెలంగాణ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌), ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఇద్దరు కూడా యువనాయకులు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చినవారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధమే ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సమర్థించారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ స్వయంగా యూపీకి వెళ్లి.. అఖిలేశ్‌ యాదవ్‌ను కలిసివచ్చారు. వీరి దోస్తానా గురించి ఇప్పుడు చర్చ ఎందుకంటే..

ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముంగింపు దశకు వచ్చాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం అఖిలేశ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. అఖిలేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 'రాజకీయాలు పక్కనపెట్టండి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నేను కలిసిన ముఖ్యమంత్రుల్లో చాలా నిరాడంబరమైన వ్యక్తి, నచ్చిన వ్యక్తి అఖిలేశ్‌ యాదవేనని చెప్పకతప్పదు' అంటూ కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. అఖిలేశ్‌ను తాను కలిసినప్పటి ఫొటోలను ఈ సందర్భంగా షేర్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement