విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
ఈటానగర్: విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు దారితప్పి కీచకుడిగా మారాడు. ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్పై దాడి చేసి టీచర్ను చితకబాదారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన టీచర్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్కూల్ ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.