గిరిజన బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం
ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలోని ఘోఘార్డి గ్రామంలో గిరిజన బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె సోదరుడిపై కూడా వాళ్లు దాడి చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్యాం నాగవంశి, పింటు పైక్రా, మున్నాకుమార్, చక్కు ఉరావ్, కనెల్ అనే ఐదుగురు యువకులు ఈనెల 2వ తేదీన ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. తన అన్నతో కలిసి వారపు సంతకు వెళ్లి ఆమె తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
తిరిగి వచ్చే దారిలో నిందితులు వారిని ఆపినప్పుడు బాధితురాలి అన్న ప్రతిఘటించే ప్రయత్నం చేయగా వాళ్లు తీవ్రంగా కొట్టడంతో అతడు స్ప్రృహ కోల్పోయాడు. తర్వాత అతడిని ఓ గుంటలో పడేశారు. అనంతరం బాలికను సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి, రాత్రంతా ఆమెపై అత్యాచారం చేశారు. తెల్లవారుజామున ఆమెను తిరిగి పంపేస్తూ.. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అయితే ఎలాగోలా ఇంటికి చేరిన బాలిక జరిగిన సంఘటనను తన తల్లిదండ్రులకు వివరించి, పోలీసులకు ఫిర్యాదుచేసింది.