నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి | misconceptions being created on my saffron dress, says yogi adityanath | Sakshi
Sakshi News home page

నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి

Published Tue, Apr 4 2017 9:10 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి

నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి

తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్నాళ్లుగా లౌకికవాదం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమానిస్తున్న వాళ్లు తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భయపడుతున్నారని చెప్పారు. తాను కాషాయం వేసుకుంటానని, దేశంలో చాలామందికి అసలు కాషాయం అంటే ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తన పనితీరుతో అన్ని వర్గాలను మెప్పిస్తానని, అందరికీ సంతోషం పంచుతానని చెప్పారు.

పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఇంతకుముందులాగే సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రభుత్వ ప్రధాన ధర్మమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అందిస్తామని, సమాజం నుంచి గూండా రాజ్యాన్ని తరిమేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లోనే ప్రభావం స్పష్టం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెస్తామని, ఏ పరిశ్రమలోనైనా ఇక నుంచి 90 శాతం మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్లే అయ్యేలా చూస్తామని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 14 రోజుల్లోగా చెల్లిస్తామని, రాబోయే ఆరు నెలల్లో కొత్తగా ఐదారు చక్కెర కర్మాగారాలు నెలకొల్పుతామని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement