ఢిల్లీలో యూపీ సీఎం బిజీ బిజీ | UttarPradesh CM yogi adityanath meets Pranab Mukherjee, Amit Shah | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో యూపీ సీఎం బిజీ బిజీ

Published Tue, Mar 21 2017 3:33 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

UttarPradesh CM yogi adityanath meets Pranab Mukherjee, Amit Shah



న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలసిన యోగి.. తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలిశారు.

రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌తో యోగి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో ఆయనను కలిసిన యూపీ సీఎం.. పార్టీ, యూపీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్టు సమాచారం. యోగి ఇదేరోజు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్‌లతోనూ సమావేశం కానున్నారు.

ఉత్తప్రదేశ్‌ సీఎంగా యోగి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆయన గోరఖ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా గతంలో అనేక సార్లు ఢిల్లీకి వచ్చిన ఆయన సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ పెద్దలను కలిశారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement