దాద్రిలో పర్యటిస్తున్న సంగీత్ | Mob Killing: Sangeet Som Visits Dadri, Homeguards Constable Detained | Sakshi
Sakshi News home page

దాద్రిలో పర్యటిస్తున్న సంగీత్

Published Sun, Oct 4 2015 1:15 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Mob Killing: Sangeet Som Visits Dadri, Homeguards Constable Detained

లక్నో : ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఆదివారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే ఎమ్మెల్యే సంగీత్ సోమ్ గతంలో జరిగిన ముజఫర్నగర్ అల్లర్లలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో  గోవధ వదంతుల నేపథ్యంలో గత సోమవారం రాత్రి సుమారు వంద మంది స్థానికులు ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేశారు. మహ్మద్ అక్లాఖ్‌ (50) ను రాళ్లతో కొట్టి హత్యచేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడి కుమారుడు డానిష్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల్లో హెంగార్డ్ కూడా ఉన్నాడు. బాధిత కుటుంబ సభ్యులు ఈ రోజు లక్నోలో  ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ని కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement